హోర్ముజ్ జలసంధి తెరుస్తారా లేక దాడి చేయమంటారా? ట్రంప్

August 05, 2026
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని, లేకపోతే అమెరికా నుంచి మరోసారి తీవ్ర స్థాయి సైనిక దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. 

ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం తప్పనిసరి షరతని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే చర్చల నుంచి ఇరాన్ వెనక్కి తగ్గితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 

హోర్ముజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనేందుకు అమెరికా, ఒమన్ మధ్య దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 


Related Post