నేడు తెలంగాణ విమోచన దినోత్సవం.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇదివరకు పాలించిన బీఆర్ఎస్ పార్టీలు దీనిని అధికారికంగా నిర్వహించకపోవడంతో, కేంద్ర ప్రభుత్వమే ఏటా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అంతకుముందు వీర సైనిక్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి కేంద్ర సాయుధ బలగాలు నిర్వహించిన కవాతును తిలకించి గౌరవ వందనం స్వీకరించారు.
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు ఉన్నతాధికారులతో పాటు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బిజేపి ముఖ్య నేతలు హాజరయ్యారు.