ఇటీవల తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన రాజకీయ ఆధిపత్య పోరుని అందరూ చూసే ఉంటారు. శాసనసభ ఆవరణలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హడావుడిగా చేయగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు దళితులు గజ్వేల్లోని కేసీఆర్ ఫామ్‌హౌసు వద్ద చావుడప్పు మోగిస్తూ హడావుడి చేశారు. ఈ ఘర్షణలపై పరస్పరం విమర్శించుకుంటూ పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు చేసుకున్నారు.
గజ్వేలలో దళితులు తిరిగిన ప్రదేశాన్ని కొందరు బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్ళతో శుద్ధి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పడుతూ వారిపై పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో వారందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ వారి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారందరూ విజయవాడలో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్ళి వారిని అరెస్ట్ చేశారు.
వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరుచగా, 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు వారందరినీ సిద్ధిపేట జైలుకి తరలించారు. అరెస్ట్ అయిన వారిలో వరదరాజ్‌పూర్ సర్పంచ్‌తో సహా మొత్తం ఆరుగురు బీఆర్ఎస్ పార్టీ నేతలున్నారు.
శాసనసభ ఆవరణలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లపై సైఫాబాద్ పోలీస్ స్టేషనలో వేరేగా మరో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో వారిరురికీ పోలీసులు నోటీసులు జారీ చేయడం ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు తమ న్యాయవాదులతో వచ్చారు.
పోలీసులు శాసనసభ వద్ద సీన్ రిక్రేయేట్ చేసేందుకు వారిని తరలించాలనుకుంటే, మళ్ళీ అప్పుడు వారికీ, పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ న్యాయవాదులు పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించి నిరసనలు తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనలు మరో వివాదంగా మారాయి. విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీసులు వారిపై మరో కేసు నమో చేస్తారేమో?