రాకాలో.. రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్‌

September 15, 2026


img

అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ‘రాకా’లో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో ఆమె యుద్ధరంగంలో ఉన్నట్లు చూపారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ గుర్రాలపై కత్తులు పట్టుకొని యుద్ధాలు చేస్తున్న సైనికులను చూపించడంతో అసలు ‘రాకా’ సినిమా కథ ఏమిటి? ఇది పీరియాడికల్ ఫిక్షన్ మూవీయా లేక దాంతో ముదిపడుతున్న భవిష్యత్‌ ఫిక్షన్ మూవీయా? అని ఈ ఒక్క పోస్టర్‌తోనే సందేహం కలిగేలా చేశారు.       

సుమారు వెయ్యి కోట్లు బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్స్ స్మిత్ ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’లో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన, దీపికా పడుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌ నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ నాలుగు పాత్రలు అంటే తాత, తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం అల్లు అర్జున్‌కి లుక్ టెస్ట్ చేయగా చాలా బాగుండటంతో నాలుగు పాత్రలకి ఆయననే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 9 భారతీయ భాషల్లో రాకా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా షూటింగ్‌ పూర్తి చేసి 2027 వేసవిలో ‘రాకా’ విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష