మహావతార్ పరశురామ్‌ టైటిల్‌ పోస్టర్

April 19, 2026
img

 ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమా తర్వాత హోంబలే ఫిల్మ్స్‌ మరో సినిమా సిద్దం చేస్తోంది. అదే మహావతార్ పరశురామ్‌.

కొద్ది సేపటి క్రితం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్ విడుదల చేసింది. ‘ధర్మం నశించినప్పుడు పరశు ఉద్భవిస్తుంది’ అంటూ యుద్ధభూమిలో రక్తమోడుతున్న గండ్ర గొడ్డలితో పరశురాముని చూపారు. టైటిల్‌ పోస్టర్ అద్భుతంగా ఉంది.      

దశావతారాలలో ఆరు అవతారాలను ‘మహావతార్ సిరీస్’లో సినిమాలుగా తీసి రాబోయే 12 ఏళ్ళలో విడుదల చేస్తామని హోంబలే ఫిల్మ్స్‌ ఇదివరకే ప్రకటించింది. చెప్పినట్లుగానే మొదట ‘మహావతార్ నరసింహ’ ఇప్పుడు మహావతార్ పరశురామ్‌ని సిద్ధం చేస్తోంది. 

దీనికీ మహావతార్ నరసింహకు పని చేసిన టీమే పనిచేస్తోంది.  ఈ సినిమాకు దర్శకత్వం: అశ్విన్ కుమార్‌, సంగీతం: శామ్ సి చేస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్ మహావతార్ పరశురామ్‌ని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కాబోతోంది.

Related Post