హైదరాబాద్‌ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు!

July 19, 2026
img

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి సాటి మహిళా అధికారిణిని లైంగికంగా వేధించాడు. బాధితురాలు వివాహిత. అయినా ప్రతీరోజు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ, బూతులు తిడుడుతూ వేధించేవాడు.

అయినా ఆమె ఇంతకాలం మౌనంగానే భరించింది. కానీ ఇటీవల అతను కత్తితో బెదిరించి ఆమె ఫోన్ తీసుకొని దాంతోనే కొన్ని ప్రైవేట్ వీడియోలు కూడా రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపాడు. ఇది ఆమె కాపురాన్ని, జీవితాన్ని దెబ్బ తీస్తుందని వేరే చెప్పక్కరలేదు.

కనుక ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో సదరు ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై పిర్యాదు చేసింది. పోలీసులు ఆమె పిర్యాదు ఆధారంగా సెక్షన్స్ 74,75,77,315(2) 66 (సి) కింద కేసు నమోదు చేశారు. నేడో రేపో పోలీసులు నోటీస్ ఇచ్చి అతని స్టేట్‌మెంట్‌ కూడా నమోదు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

శిక్షణ ఇచ్చి దేశానికి ఐపీఎస్ అధికారులను అందించే జాతీయ పోలీస్ అకాడమీలోనే ఓ ట్రైనీ అధికారి మరో ట్రైనీ అధికారిణితో ఈవిధంగా వ్యవహరించడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. ఇప్పుడు ఈ కేసు కారణంగా ఐపీఎస్ అధికారి అయ్యేందుకు ఇంతకాలం పడిన శ్రమ వృధా అవుతుంది. పైగా ఈ కేసులో దోషిగా తేలితే జైలు శిక్ష కూడా తప్పదు.

Related Post