సింగరేణి కార్మికులను పట్టించుకోరా? కవిత ప్రశ్న

July 19, 2026

img

సింగరేణి కార్మికుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న2,000 మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతినెలా రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

తాను హెచ్చరించిన తర్వాతే సింగరేణి మొక్కుబడిగా రెండు రోజుల పాటు మెడికల్ బోర్డు నిర్వహించిందని కవిత ఆరోపించారు.

రెండు వేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకుంటే వారిలో కేవలం 20 శాతం మందినే అన్‌ఫిట్ చేసి, 120 మంది పేర్లనే ప్రకటించారని, దానిలో కూడా 28 మంది కార్మికులకు సమాచారం లేదని ఆమె విమర్శించారు.

సింగరేణిని కాపాడాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు.

సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలిసి ప్రతినెలా రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

గతంలో అమలు చేసిన విధంగానే అన్‌ఫిట్ ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలను నిలదీయాలని హెచ్‌ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

మెడికల్ బోర్డును నామమాత్రంగా నిర్వహించి మరోసారి సింగరేణి కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

2 వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తుంటే కేవలం 120 మంది కార్మికుల పేర్లు మాత్రమే ప్రకటించి.. అందులోనూ 28 మంది కార్మికులకు తమను మెడికల్ బోర్డుకు పిలిచారనే సమాచారం… pic.twitter.com/jKmgoCD1Aj
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 19, 2026

Related Post