త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు!

July 17, 2026
img

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) దేశంలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టబోతోంది. ముందుగా 2027 నాటికి  రూ. 10, 20 పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్టులా ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇవి ప్రత్యేకమైన  ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. కనుక సాధారణ కరెన్సీ నోట్లతో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీరు, తేమ, దుమ్ము వల్ల త్వరగా పాడవకుండా ఉంటాయి. అలాగే చిరిగి పోయే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. 

ప్రపంచంలోని ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్, సింగపూర్ వంటి అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీ నోట్లను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి.

కనుక భారత్‌లో కూడా ఇటువంటి కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ నోట్ల ముద్రణకు అవసరమైన పాలిమర్ సీట్ల తయారీ, సరఫరా కోసం ఆర్‌బీఐ ఆసక్తి వ్యక్తీకరణ కొరకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. బిడ్స్ సమర్పించేందుకు ఆగస్ట్ 18 గడువు విధించింది.  

కాగితంతో తయారుచేసే కరెన్సీ నోట్లతో పోల్చితే ఈ పాలిమర్ నోట్లలో ఆధునిక భద్రతా ఫీచర్లు ఏర్పాటు చేయడం సులభం. కానీ వీటికి నకిలీ నోట్లు తయారు చేయడం చాలా కష్టం. ఒకవేళ చేసినా సులభంగా నకిలీ నోట్లను గుర్తించవచ్చు. కనుక ఈ కొత్త ప్రయోగం విజయవంతమైతే ఆ తర్వాత క్రమంగా రూ. 50, 100, 200, 500 కరెన్సీ నోట్లను కూడా ముద్రించే అవకాశం ఉంది.

Related Post