నేటి నుంచి ఆషాడ బోనాలు

July 16, 2026
img

ఆషాఢమాసంలో మొదటి గురు లేదా ఆదివారంనాడు బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఏడాది బుధవారం  నుంచి ఆషాఢమాసం మొదలైంది. కనుక ఆనవాయితీ ప్రకారం నేటి నుంచి బోనాల ఉత్సవాలు మొదలైయ్యాయి. 

ఆనవాయితీ ప్రకారం నేడు ముందుగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా  బోనాల ఉత్సవాలు మొదలవుతాయి.

నేటి నుంచి ఆగస్టు 13 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15కోట్లు నిధులు కేటాయించింది. రాష్ట్రంలో సుమారు 3,500 అమ్మవారి దేవాలయాలున్నాయి. వాటన్నిటిలో నేటి నుంచి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. 

హైదరాబాద్‌ నగరంలో వివిధ ఆలయాలలో బోనాలు జరిగే తేదీలు:  

జూలై 16 (గురువారం): గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు

జూలై 19 (ఆదివారం): సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు)

జూలై 26 (ఆదివారం): బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి బోనాలు

ఆగస్టు 2 (ఆదివారం): సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

ఆగస్టు 3 (సోమవారం): శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం (భవిష్యవాణి)

ఆగస్టు 9 (ఆదివారం): పాతబస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలు

ఆగస్టు 10 (సోమవారం): రంగం కార్యక్రమం & అమ్మవారి ఘటాల ఊరేగింపు.

Related Post