బీఈడీ, బీపీఎడ్, డీపీఎడ్ కౌన్సలింగ్ షెడ్యూల్

July 14, 2026
img

రాష్ట్రంలో బీఈడీ, బీపీఎడ్, డీపీఎడ్ ప్రవేశాల కొరకు ఈ నెల 21 నుంచి కౌన్సలింగ్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ మంగళవారం విడుదల చేస్తామని, మూడింటికీ వేర్వేరుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి తెలిపారు.  

ఎడ్ సెట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు ఈ నెల 21 నుంచి 28 వరకు, పీఈ సెట్ ఉత్తీర్నులకు 21 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఎడ్ సెట్‌ వెబ్‌ ఆప్షన్స్ ఆగస్ట్ 2 నుంచి 4 వరకు, పీఈ సెట్‌ వెబ్‌ ఆప్షన్స్ ఆగస్ట్ 28 నుంచి 30 వరకు గడువు ఉంటుందని తెలిపారు.    

బీపీఎడ్, డీపీఎడ్ సీట్లను ఆగస్ట్ 2న, బీఈడీ సీట్లను ఆగస్ట్ 8న ఖరారు చేసి కేటాయిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి తెలిపారు.

Related Post