రాష్ట్రంలో బీఈడీ, బీపీఎడ్, డీపీఎడ్ ప్రవేశాల కొరకు ఈ నెల 21 నుంచి కౌన్సలింగ్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేస్తామని, మూడింటికీ వేర్వేరుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి తెలిపారు.
ఎడ్ సెట్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు ఈ నెల 21 నుంచి 28 వరకు, పీఈ సెట్ ఉత్తీర్నులకు 21 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఎడ్ సెట్ వెబ్ ఆప్షన్స్ ఆగస్ట్ 2 నుంచి 4 వరకు, పీఈ సెట్ వెబ్ ఆప్షన్స్ ఆగస్ట్ 28 నుంచి 30 వరకు గడువు ఉంటుందని తెలిపారు.
బీపీఎడ్, డీపీఎడ్ సీట్లను ఆగస్ట్ 2న, బీఈడీ సీట్లను ఆగస్ట్ 8న ఖరారు చేసి కేటాయిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి తెలిపారు.