సెమీ కండక్టర్ రంగంలో కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) అత్యంత కీలకమైనది. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యూనిట్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శనివారం దీనికి ప్రారంభోత్సవం చేశారు. జపాన్‌కు చెందిన ‘తోహో కోకి’ సంస్థ సాంకేతిక సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు.
ఇప్పుడు సీఎంపీ హైదరాబాద్‌లోనే అందుబాటులోకి రావడంతో దేశంలో ముఖ్యంగా తెలంగాణలో సెమీ కండెక్టర్ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. రాబోయే రెండేళ్ళలో హైదరాబాద్‌లోనే సీఎంపీ ప్యాడ్స్ తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు.
ఈ రంగంలో శిక్షణ, పరిశోధనలతో పాటు ప్రోటో టైపింగ్, చిప్ తయారుచేయడం వరకు సెమీ కండక్టర్ పరిశ్రమలకు అవసరమైన మౌలికవసతులు, నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానం సమస్తం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
ఇంతకాలం హైదరాబాద్ అంటే ఐటి కంపెనీలు, ఐటి రంగానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు ఏరో స్పేస్ మొదలు సెమీ కండెక్టర్ తయారీవరకు అన్ని రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గణనీయమైన ఈ మార్పులు, అభివృద్ధి వలన లక్షలాదిమంది కి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయి.
Launched Project SHUDH at T-Works today, bringing robotics, AI and intelligent systems to underground sewer management.
The initiative marks an important step towards safer sanitation, smarter urban services and protecting our frontline workers.
Telangana remains committed to… pic.twitter.com/R28szdsFFc