మూడు నెలలు మంత్రి పదవి ఇస్తే... హరీష్‌ సవాల్

July 08, 2026

img

మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సవాలు విసిరారు. కన్నేపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది. ఇక పనికి రాదంటూ పాత ఫోటోలు, వీడియోలు చూపించి మాట్లాడటం కాదు. వాటిని ఆనాడే కాంట్రాక్ట్ సంస్థ మరమత్తులు చేసి అప్పగించింది. వాటితోనే మా ప్రభుత్వ హయంలో గోదావరి నీళ్ళు ఎత్తిపోశాము కూడా.

కానీ ఎదురుగా లక్ష క్యూసెక్కుల గోదావరి నీళ్ళు,  పక్కనే కన్నెపల్లి పంప్ హౌస్ సిద్దంగా ఉన్నప్పటికీ ఎందుకు మోటార్లు ఆన్‌ చేసి నీళ్ళు ఎత్తిపోయడం లేదు? మీ వల్లకాకపోతే ఓ మూడు నెలలు నన్ను మంత్రిని చేస్తే కన్నేపల్లి పంప్ హౌస్ మోటర్లతోనే నీళ్ళు ఎత్తిపోయిస్తా.ఎల్లంపల్లికి నీళ్ళు పారిస్తా.

నాకు మీరేమీ జీతం, కారు, ఆఫీసు, కనీసం ప్యూన్ కూడా ఇవ్వనసరం లేదు. ఆ ప్రాజెక్టుని నాకు మూడు నెలలు అప్పగిస్తే చాలు నీళ్ళు పారిస్తా. లేకుంటే రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకుంటా!

నాకు ఈ పదవులు కొత్తేమీ కాదు. నా వెనక రాజకీయాలలోకి వచ్చిన మీకే కొత్త. నా సవాలు స్వేకారించే దమ్ముందా రేవంత్ రెడ్డి? అంటూ హరీష్‌ రావు సవాల్ విసిరారు.

గతంలో కూడా హరీష్‌ రావు ఈవిధంగా సవాళ్ళు విసిరారు. కానీ ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరో పార్టీ నాయకుడి, ముఖ్యంగా తమ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న హరీష్‌ రావుని పిలిచి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తారని ఎలా అనుకోగలము?

కానీ హరీష్‌ రావు సూటి ప్రశ్నలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సహేతుకమైన, సంతృప్తికరమైన జవాబులు చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది.

కన్నెపల్లి వద్ద గోదావరి నదిలో ప్రవాహం ఉదృతంగా ఉంది..
ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే రోజులు 3 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది.

అయినా వర్షాలు పడటం లేదు, నీరు ఎలా ఎత్తాలని
సిగ్గులేకుండా నిన్న పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి నీకు రాజకీయాలు… pic.twitter.com/2z3y3PZ6wY
— BRS Party (@BRSparty) July 8, 2026

Related Post