కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు పొందిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'ఈఎన్‌ఈ రిపీట్’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం నవంబర్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ విషయాన్ని సినిమా విడుదలై ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక వీడియోతో ప్రకటించారు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మొదటి సినిమాలో నటించిన విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను తమ పాత్రల్లోనే కనిపించనున్నారు. అయితే తొలి చిత్రంలో కార్తీక్ పాత్ర పోషించిన సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో ఈసారి శ్రీనాథ్ మాగంటి నటిస్తున్నారు.
స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలతో రూపొందిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం 2018లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత కాలంలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సినిమా 2023లో రీ-రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. దీంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సీక్వెల్‌కు కూడా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్; ఎడిటింగ్: రవితేజ గిరిజాల చేస్తున్నారు.
ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.