అనిల్ రావిపూడి-వెంకటేష్ సూపర్ హిట్ కాంబినేషన్ అని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో స్పష్టమైపోయింది. ఈసారి నందమూరి కల్యాణ్ రామ్‌ని కూడా కలుపుకొని మళ్ళీ సంక్రాంతి పండగకే వస్తున్నామంటూ ఇటీవలే కొబ్బరికాయ కొట్టేశారు.
ఈసారి ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు ‘శ్రీమన్’ని కూడా ఈ సినిమాలోకి తీసుకున్నారు. ఆయన స్వయంగా అనిల్ రావిపూడితో దిగిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి విడుదలవుతుండటంతో తెలుగు ప్రజలు కూడా తనను ఆదరిస్తున్నారన్నారు.
తనను తమిళియన్ అని అనుకుంటున్నారని కానీ తాను తెలుగువాడినేనని శ్రీమన్ చెప్పారు. తన పూర్వీకులు తమిళనాడు వెళ్ళి స్థిరపడటంతో తాను కూడా కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నానని, ఎప్పటికైనా తెలుగులో సినిమాలు చేయాలనే తన కోరికని అనిల్ రావిపూడి తీర్చుతున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.
ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కి జోడీగా క్రుతిశెట్టి నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు కనుక దీనికి ‘జనవరి 13’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.
🙏 to god
Thanks to Anil Garu
Never expected a straight film in Telugu,One week shoot completed, just pinched myself for the confirmation that I’m working in my mother tongue,set is with positive energy,comedy rollercoaster, omg full fun blessed to work with this Amazing team pic.twitter.com/fCUlkVAUPQ