బాసర జ్ఞాన సరస్వతి ప్రధాన ఆలయం పునర్నించబోతున్న సంగతి తెలిసిందే. కనుక నేడు ఆలయ పూజారులు ప్రధానాలయంలోని లక్ష్మీ, సరస్వతి, మహంకాళీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత విగ్రహాలను సమీపంలో ఉన్న బాలాలయంలోకి తరలించి అక్కడ ప్రతిష్టించారు. మళ్ళీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనాలకు అనుమతించారు. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయ్యేవరకు బాలాలయంలోనే నిత్యపూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. నేటి నుంచే అక్కడ పిల్లలకు అక్షరాభ్యాసాలు కూడా ప్రారంభించారు. అమ్మవార్ల విగ్రహాలు బాలలయంలోకి తరలించిన తర్వాత ఎమ్మెల్యే రామారావు పటేల్ తదితరులు ప్రధానాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.