సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జూన్ 19న ఈ సినిమా విడుదల కాగా ఈ మూడు వారాలలోనే , ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఓటీటీలోకి వచ్చేలోగా వంద కోట్లు సాధిస్తే ఇది ఆమె కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.
పెద్ద హీరోల సినిమాలు చతికిలపడుతున్న ఈ సమయంలో సమంత తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇలాంటి హీరోయిన్ ఓరియంటడ్ సినిమా తీస్తే అది ఈ స్థాయిలో వసూళ్ళు రాబట్టడం విశేషమే.
ఈ సినిమా హిట్ అవడంతో దీనికి సీక్వెల్ తీస్తామని ఆమె భర్త, నిర్మాత రాజ్ నిడిమొరు సక్సస్ మీట్‌లో ప్రకటించారు. కానీ ప్రస్తుతం సమంత గర్భం దాల్చినందున కొంత విరామం తీసుకుంటానని చెప్పారు. ఆలోగా సీక్వెల్ కథ, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకోవచ్చు. అవి పూర్తయితే ఆమె లేని సన్నివేశాలు షూటింగ్ మొదలుపెట్టవచ్చు. కనుక మా ఇంటి బంగారం సీక్వెల్ ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.