ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి తాజా ప్రెస్‌మీట్‌లో తాను అమరావతిని రాజధానిగా అంగీకరించనని, తాను ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) రాజధానికి కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.
అంతేకాదు వచ్చే ఎన్నికలు అమరావతికి, మావిగన్‌కి మద్దతు ఇచ్చేవారి మద్య జరుగబోతున్నాయని చెప్పారు. అంటే మావిగన్ ప్రతిపాదనపై ‘రిఫరెండం’ అని చేపుతున్నారన్న మాట!
గతంలో మూడు రాజధానులు, విశాఖ రాజధాని అన్న జగన్ ఇప్పుడు కొత్తగా మావిగన్‌ప్రతిపాదన తెరపైకి తెచ్చి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలనుకోవడం గమనిస్తే, ఒకవేళ అయన మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధాని విషయంలో అనిశ్చితి తప్పదని స్పష్టమవుతోంది.
గతంలో ఈ అనిశ్చితి వలన తెలంగాణ చాలా లాభపడింది. ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు స్థాపించాలనుకున్న పలువురు ఇలాంటి రాజకీయ అనిశ్చితితో ఉన్న ఏపీ కంటే తెలంగాణను మరింత సురక్షితమైన గమ్యస్థానంగా భావించడం వలన హైదరాబాద్‌లో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టారు.
ఒకవేళ జగన్ మళ్ళీ ఏపీలో అధికారంలోకి వచ్చి మావిగన్ కోసం అమరావతిని పక్కన పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. కనుక రాజధాని విషయంలో అయన వైఖరి ఏపీకి శాపంగా, మరోసారి తెలంగాణకు వరంగా మారవచ్చు.