అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేసిన ‘లెనిన్ జూలై 10న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ట్రైలర్ విడుదల చేశారు. సత్యదేవ్ సినిమా ‘రావు బహద్దూర్’ ట్రైలర్ మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో విడుదల చేయగా, లెనిన్ ట్రైలర్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో విడుదల చేయడం విశేషం.
ఓ గ్రామంలో మహాభారత గాధ నేపధ్యంలో సాగే ఓ రొమాంటిక్ కమర్షియల్ సినిమాయే లెనిన్ అని ట్రైలర్‌లో స్పష్టం చేశారు.
ఈ సినిమాకి సంగీతం: తమన్; పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, కెమెరా: ఐ నవీన్ కుమార్; యాక్షన్: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్; కోరియోగ్రఫీ: బ్రిందా మాస్టర్, దినేష్ మాస్టర్, లీల మాస్టర్; ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. జూలై 10న లెనిన్ విడుదల కాబోతోంది.