గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా ‘టాక్సిక్’ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్) నుంచి లేడీస్ & లేడీస్ అంటూ తాజాగా ఓ టీజర్ వదిలారు. ‘టాక్సిక్’లో నయనతార, కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ ఐదుగురు హీరోయిన్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
వారందరినీ చూపిస్తూ వదిలిన టీజర్‌లో డబుల్ మీనింగ్ డైలాగులు కాకుండా నేరుగా అశ్లీల డైలాగులే ఉన్నాయి. కనుక తాత, ముత్తాతల మొదలు అందరూ తమ పిల్లలని ఈ సినిమాకి దూరంగా ఉంచాలని టీజర్‌లో ముందే హెచ్చరించారు.
భారీ అంచనాలున్న టాక్సిక్ రెండు వాయిదాల తర్వాత ఆగస్ట్ 26న విడుదలకు సిద్దమవుతోంది.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.