ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌: గాడ్ ఆఫ్ వార్ పోస్టర్

June 30, 2026


img

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ ఓ పౌరాణిక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనిని ధృవీకరిస్తూ శివుడి కుమారుడు.. పార్వతీదేవి ముద్దుల కుమారుడు... కాలాతీతమైన నాయకుడు... 'గాడ్ ఆఫ్ వార్'ని పరిచయం చేస్తూ త్రిశూలం బొమ్మతో ఓ పోస్టర్ వేశారు. అగ్నిజ్వాలల మద్య అనేక దేవాలయాలు, కాషాయ జెండాలు, గుట్టగుట్టలుగా పడున్న సైనికుల మృతదేహాలతో పోస్టర్ చాలా భీభత్సంగా ఉంది.     

శివపార్వతుల తనయులలో  తెలుగువారు సుబ్రహ్మణ్యస్వామిగా కొలిచే దేవుడిని తమిళ ప్రజలు ‘మురుగన్‌’గా పూజిస్తుంటారు.

కొన్ని నెలల క్రితం జూ.ఎన్టీఆర్‌ వార్-2 షూటింగ్‌ కోసం ముంబాయి వెళుతున్నప్పుడు అయన చేతిలో తమిళ రచయిత ఆనంద బాలసుబ్రహ్మణ్యం వ్రాసిన ‘మురుగ ది లార్డ్ ఆఫ్ వార్, ది లార్డ్ ఆఫ్ విస్డమ్‌,’ అనే పుస్తకం కనిపించింది. కనుక ఆ కథ ఆధారంగా 'గాడ్ ఆఫ్ వార్' పేరుతో ఈ సినిమా తీయబోతున్నట్లు అప్పుడే హింట్ ఇచ్చారు.

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కలిసి చివరిగా చేసిన ‘అరవింద సమేత.’ ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళ వరకు వారిద్దరూ కలిసి సినిమా చేయలేదు. కనుక వారిద్దరూ ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటన వెలువడినప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

 ఇద్దరూ కలిసి ఇటువంటి పౌరాణిక సినిమా చేస్తుండటం విశేషమే. ప్రస్తుతం త్రివిక్రమ్‌-వెంకటేష్‌ కలిసి ‘ఆదర్శ కుటుంబం’ పూర్తిచేస్తున్నారు. అక్టోబర్ 2న విడుదల చేస్తామని ఇటీవలే ప్రకటించారు. 

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్నారు. ఇద్దరూ తమ సినిమాలు పూర్తి చేయగానే ఈ సినిమా మొదలు పెడతారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు. 

ఈ సినిమాకు అనిరుధ్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్  బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్‌ చరణ్‌ కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష