ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తొలిసారిగా దర్శకత్వం చేయబోతున్న సినిమా పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
మురళీమోహన్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, పి.వి. రవికిషోర్ క్లాప్ కొట్టారు. రామ్ పోతినేని స్వయంగా ముహూర్తపు షాట్‌కి దర్శకత్వం వహించారు. నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్‌ను రామ్ పోతినేనికి అందజేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఇది రామ్ పోతినేని 23వ సినిమా. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి కథ రామ్ పోతినేని వ్రాసుకోవడం మరో విశేషం. ఈ సినిమాలో రామ్ పోతినేని పాత్ర పేరు ‘వీర.’
ఈ సినిమా పేరు ఇంకా ప్రకటించలేదు. కనీ ఇది ‘ఒంటరి తోడేలు కథ’ అంటూ ఇచ్చిన టాగ్ లైన్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా శ్రీనిధి శెట్టి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే హీరోయిన్‌తో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను ప్రకటించనున్నారు.