శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ చేస్తున్న‘ఇరుముడి’ నుంచి ఇరుముడి కట్టు.. లిరికల్ వీడియో సాంగ్ సోమవారం విడుదలైంది. ఈ పాటలో స్వామియే అయ్యప్పో... అయ్యప్పో స్వామియే అనే లిరిక్స్ యధాతధంగా ఉంచి మిగిలిన పాట ట్యూన్ మార్చి కొత్తబాణిలో విడుదల చేశారు. దర్శకుడు శివ నిర్వాణ, కళ్యాణ చక్రవర్తి కలిసి వ్రాసిన ఈ పాటకి జీవి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా అనంతు బృందం ఆలపించారు.
ఇరుముడి భక్తి ప్రధాన చిత్రమైనప్పటికీ తండ్రీ కూతుర్ల అనుబంధంతో సాగే ఎమోషనల్ డ్రామాని జోడించడం ద్వారా మాస్ హీరో రవితేజ సినిమాకిఅవసరమైన కమర్షియల్ యాంగిల్ జోడించారు.
ఈ సినిమాలో రవితేజకు భార్యగా ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శివ నిర్వాణ, సంగీతం: జీవి. ప్రకాష్ కుమార్, కోరియోగ్రఫీ: శేఖర్ వీజే, బాబా భాస్కర్, కెమెరా: విష్ణు శర్మ, ఆర్ట్: భార్గవ నౌదండ్ల, స్టంట్స్: రామ్ లక్షణ్, రియల్ సతీష్, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్న ఇరుముడి ఆగస్ట్ 21న విడుదల కాబోతోంది.