సిఎం విజయ్‌ మరో వివాదాస్పద నిర్ణయం!

June 27, 2026


img

కోలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసి టీవీకే పార్టీతో రాజకీయాలలో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే తమిళనాడు సిఎం అయిన జోసెఫ్ విజయ్‌ మరోసారి వివాదస్పద నిర్ణయం తీసుకొని విమర్శల పాలవుతున్నారు. 

మొదట తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను సీఎంవోలో ఓఎస్‌డీగా నియమించారు. ప్రతిపక్షాల విమర్శలతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. కనుక మళ్ళీ అటువంటి తప్పులు చేయరనుకుంటే చేశారు.  

విజయ్‌ చివరిగా నటించిన 'జననాయగన్' సెన్సార్ సమస్యల వలన నేటికీ విడుదల కాలేదు. ఆ సినిమా ఇంటర్నెట్‌లో  లీక్ అయ్యింది కూడా. కనుక దానికి నష్ట పరిహరమన్నట్లు ఆ సినీ నిర్మాత కె. వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. 

ఇటువంటి నియామకాలతో సిఎం విజయ్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే విమర్శిస్తోంది. ఓ సినీ నిర్మాతకు మంత్రి హోదా కలిగిన పదవి కట్టబెట్టడాన్ని తప్పు పడుతున్నాయి. కనుక సిఎం విజయ్‌ విమర్శలకు తలొగ్గి ఈ నియామకాన్ని కూడా రద్దు చేస్తారా లేదా? చూడాలి. 


Related Post