బాహుబలి-3 ఉంది: ప్రభాస్‌

June 26, 2026


img

రెండు భాగాలుగా తీసిన బాహుబలి సూపర్ హిట్ అయినప్పటికీ దర్శకుడు రాజమౌళి అక్కడితో ఆగలేదు. బాహుబలి పేరిట మొదట యానిమేషన్ చిత్రం తర్వాత రెండు భాగాలు కలిపి ఒకటిగా మరో చిత్రం విడుదల చేసి కలెక్షన్స్‌ రాబట్టుకున్నారు.

తాజాగా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ అంటూ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. అయితే బాహుబలిని ఇంతటితో విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రభాస్‌, రానా, అనుష్కలతో చెప్పించేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ టార్చ్ బేరర్ విడుదలవుతున్న సందర్భంగా వారు ముగ్గురితో ఓ వీడియో చేసి విడుదల చేశారు.

దానిలో రానా మాట్లాడుతూ, “ప్రస్తుతం రాజమౌళి మా పక్కన లేరు. కనుక ఇది చెప్పొచ్చో లేదో తెలియదు. ప్రపంచం ఈ ప్రకటనకు సిద్ధంగా లేదు. మీ అందరి కోసం బాహుబలి-3 రాబోతోంది,” అని చెప్పగా ప్రభాస్‌, అనుష్క కూడా అవునని ధ్రువీకరించారు. 

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాశి చేస్తున్నారు. అది వచ్చే ఏడాది లో విడుదల కాబోతోంది. కనుక దాని తర్వాత బాహుబలి-3 మొదలుపెట్టవచ్చని వీరి ముగ్గురి ప్రకటనతో స్పష్టమవుతోంది. 

ప్రభాస్‌ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి-2, సలార్-2 వరుసగా పూర్తిచేయాల్సి ఉంది. హోంబోలే సంస్థతో కూడా కొన్ని  సినిమాలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

ఇవన్నీ పూర్తిచేసే సరికి బాహుబలి-3 షూటింగ్‌ మొదలుపెట్టేందుకు రాజమౌళి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉంటారు. కనుక బాహుబలి-3 షూటింగ్‌ బహుశః 2028లో మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. 


Related Post

సినిమా స‌మీక్ష