అభిమానులకు సమంత గుడ్‌న్యూస్.. గ్యాప్ తీసుకుంటారట!

June 25, 2026


img

ఇటీవల జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సస్ మీట్‌లో సమంత ‘బేబీ బంప్’తో కనిపించినప్పటి నుంచి ఆమె గర్భం దాల్చడం గురించి వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ధృవీకరిస్తూ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. 

వ్యక్తిగత, సినీ జీవితంలో, అలాగే ఆరోగ్య పరంగా కూడా ఆమె అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయినా కూడా సమంత ధైర్యంగా పోరాడుతూ ఒక్కో సమస్యని అధిగమించగలిగారు. సినీ, వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకోగలిగారు. గుండె నిబ్బరంతో అన్ని సమస్యలను అధిగమించి జీవితాన్ని చక్క దిద్దుకోగలగడం నిజంగా  చాలా అభినందనీయమే. 

కష్ట సమయంలో మహిళలు ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరం కలిగి ఉండటం చాలా అవసరమని, మనం సమస్యలను ఎదుర్కోగల ధైర్యం ఉన్నప్పుడే జీవిత భాగస్వామితో సజావుగా జీవితం సాగిపోతుందని సమంత చెప్పిన మాటలు అక్షరాల నిజమే కదా?

ఆమెను అర్థం చేసుకొని అన్ని విధాల సహకరించే భర్త రాజ్ నిడిమోరు దక్కడం కూడా అదృష్టమనే చెప్పాలి. 


Related Post

సినిమా స‌మీక్ష