రమేష్ బండ్రేడ్డి దర్శకత్వంలో హర్ష రోహాన్, నక్షత్ర జంటగా చేస్తున్న ‘తెల్ల కాగితం’ నుంచి చిలకా కొత్తగా కొత్తగా ఉందే ఈవేళ.. అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. పూర్ణాచారి వ్రాసిన ఈ పాటని విజయ్ బుల్గానిన్ స్వరపరిచి సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు.
తన స్పీడుకి సరిపోయేలా ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ చేయడంతో కుర్ర హీరో హర్ష రోహాన్ డాన్స్ అదరగొట్టాడు. చిన్న చిన్న తేలికైన పదాలతో క్యాచీగా వ్రాసిన పాట యువతకు బాగా నచ్చుతుంది. తెల్ల కాగితం వంటి మనసులు కలిగిన హైస్కూల్ విద్యార్ధుల ప్రేమలను ఈ సినిమాలో మరోసారి చూపించబోతున్నారని ఈ ఒక్క పాటతో చెప్పారు.
ఈ సినిమాలో దీపక్, అజయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: నందు సవిరిగన, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: కేవీ గుహన్, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్: ఆర్. కార్తీక శ్రీనివాస్ చేశారు.
కే. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.