సర్దార్-2 వచ్చేస్తున్నాడు.. సెప్టెంబర్‌లో

June 24, 2026


img

తమిళ కథానాయకుడు కార్తీ హీరోగా నటిస్తున్నసర్దార్-2 విడుదల తేదీ ఖరారు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 10వ తేదీన సర్దార్-2 విడుదల ప్రకటించారు.

నాలుగేళ్ళ క్రితం విడుదలైన సర్దార్ మొదటి భాగంలో కార్తి పోలీస్ ఆఫీసర్, గూఢచారిగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. దేశంలో జరుగుతున్న మంచి నీళ్ళ వ్యాపారం చుట్టూ అల్లిన కథని రాజకీయాలు, దేశభద్రతతో ముడిపెట్టి చూపడంతో సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుంచి దీని సీక్వెల్ కోసం అభిమానులు కార్తీని అడుగుతూనే ఉన్నారు. 

ప్రముఖ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ‘మిషన్ ఆఫ్ లైఫ్ టైమ్‌’ ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న సర్దార్-2లో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ‘బ్లాక్ డాగర్’ (విలన్)గా ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: సామ్‌ సిఎస్, కెమెరా: జార్జ్ సి విలియమ్స్, కథ, స్క్రీన్‌ప్లే: రత్న కుమార్, ఆశామీర అయ్యప్పన్, విఘ్నేష్ మునియాండి, నంబి, ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి చేస్తున్నారు.  

ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఎస్.లక్ష్మణ కుమార్‌ సర్దార్-2 పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష