గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిన్ఢిన ల్లీలో జరిగిన ‘రిపబ్లిక్ సమ్మిట్’లో పాల్గొన్నప్పుడు తన సినీ ప్రస్తానం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
“నా తండ్రి చిరంజీవిగారు సినీ పరిశ్రమలో ఉండటం నాకు ప్లస్ పాయింటే. కానీ మొదటి సినిమా తర్వాత ఎవరైనా సరే తమ టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పించగలిగినప్పుడే సినీ పరిశ్రమలో రాణించగలరు. మొదట్లో అందరూ నన్ను మా తండ్రిగారితో పోల్చుతూ సక్సస్ గురించి మాట్లాడేవారు. కానీ నేను ఆ ఒత్తిడిని తీసుకోలేదు. నా పంథాలో నేను సినిమాలు చేస్తూ నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, ప్రేక్షకాదరణ పొందగలిగాను.
మా ఇంట్లో సినిమా వాతావరణమే ఉన్నప్పటికీ ఇంట్లో మా సినిమాల గురించి పెద్దగా చర్చించుకునే వాళ్ళం కాదు. ముఖ్యంగా మా నాన్నగారు డైనింగ్ టేబిల్ వద్ద సినిమాల ప్రస్తావన వద్దని ఖరాఖండీగా చెప్పేవారు. అయన నా సినిమాలు చూస్తుండేవారని నాకు తెలుసు. కానీ ఎన్నడూ వాటి గురించి ఆయన నాకు ఎలాంటి ఫీడ్ బ్యాక్, సలహాలు ఇచ్చేవారు కాదు. కనుక సినిమాలకి సంబంధించి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే ఎక్కువ,” అని రామ్ చరణ్ చెప్పారు.
“పెద్ది సినిమా విషయానికి వస్తే అది నా కెరీర్లో ‘బెస్ట్ స్టార్టప్’ వంటిది. పెద్ది సినిమా... దానిలో నా పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది,” అని రామ్ చరణ్ చెప్పారు.