మెగాస్టార్ చిరంజీవి దంపతులు సమంత, రాజ్ నిడిమోరు దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి బట్టలు పెట్టి ఆశీర్వదించారు. సమంత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది.
తన సొంత బ్యానర్ ‘ట్రా లాలా మూవీ పిక్చర్స్’లో నిర్మించి నటించిన ‘మా ఇంటి బంగారం’ హిట్ అయ్యింది. ఆమె గర్భం దాల్చడంతో వైవాహిక జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ శుభ సందర్భంగా చిరంజీవి దంపతులు సమంత, రాజ్ నిడిమోరు దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి వారిని అభినందించి ఆశీర్వదించారు.
ఆమె సినిమా, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి సతీమణి సమంతకు బొట్టు పెట్టి చీర పెట్టి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి పంపారు.
చిరంజీవి అంతటివారు తమని ఇంటికి ఆహ్వానించి ఇంతగా ఆదరించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు.