రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పట్లో ఆపేదేలే!

June 22, 2026
img

నాలుగేళ్ళ క్రితం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పుడు దాదాపు యావత్ ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌ పట్ల సానుభూతి చూపాయి. అమెరికాతో సహా యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కి పరోక్షంగా సహాయసహకారాలు అందించాయి. నేటికీ అందిస్తూనే ఉన్నాయి. 

కానీ ఇప్పుడు రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్లతో భీకర దాడులు చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే 4-500 డ్రోన్లతో మాస్కోపై దాడులు చేసిన ఉక్రెయిన్‌, మళ్ళీ అదివారం వందల డ్రోన్లతో మాస్కోతో పాటు క్రిమియాపై కూడా దాడులు చేసింది. దీంతో రష్యా ప్రభుత్వం ఆయా నగరాలలో రెడ్ అలర్ట్ జారీ చేసి, బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసింది. ఉక్రెయిన్‌ డ్రోన్లను సమర్ధంగా తిప్పి కొడుతున్నామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కానీ రష్యా తమ దేశంలోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు చేస్తున్నందునే ప్రతీకార దాడులు చేస్తున్నామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. 

రష్యా-ఉక్రెయిన్‌ తీరు చూస్తుంటే అవి ఈ యుద్ధం వలన ఎంతగా నష్టపోతున్నప్పటికీ, వాటికి ఇప్పట్లో యుద్ధం ముగించే ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదు. వాటి యుద్ధం ఇంకా ఎన్నేళ్ళు సాగుతుందో ఎప్పటికి ముగుస్తుందో ఎవరికి తెలీని పరిస్థితి కనిపిస్తోంది.              


Related Post