మక్కాకు మరోసారి ముప్పు.. సౌదీ హెచ్చరిక

September 24, 2026
img

సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ విభాగం మక్కా నగరానికి మరోసారి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. మక్కాతో పాటు జెద్దా, యన్బు, తాయిఫ్, తబూక్ ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఇదివరకు యెమెన్‌లోని హూతీలు డ్రోన్లతో మక్కా నగరంపై దాడి చేయబోతే అవి మక్కా నగరానికి చాలా దూరంగా ఉన్నప్పుడే వాటిని కూల్చివేశామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. బహుశః మళ్ళీ మరోమారు హూతీలు దాడి చేయబోతున్నట్లు ముందే పసిగట్టి ఈ హెచ్చరిక జారీ చేసి ఉండవచ్చు. 

ప్రజలు అత్యవసరమైతే తప్ప బహిరంగ ప్రదేశాలు, బాల్కనీలు, భవనాల పైకప్పులపై ఉండవద్దని, వీలైనంత వరకు ఇళ్ళలోనే ఉండాలని సూచించింది. బయట ఉన్నవారు కూడా సమీపంలోని భవనాల్లో సురక్షితంగా ఉండాలని సూచించింది. 

అయితే సౌదీ ప్రభుత్వం ఆరోపణలను హూతీలు ఖండించారు. మక్కా తమకూ పూజ్యనీయమైన పవిత్రమైన ప్రదేశమేనని, కనుక మక్కాపై తాము ఎన్నడూ దాడి చేసే ఆలోచన కూడా చేయబోమని స్పష్టం చేశారు. కానీ సౌదీ తాజా హెచ్చరికలతో  సౌదీ- హూతీల మద్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. 

Related Post