శర్వానంద్ భోగి నుంచి ట్రైలర్‌

November 24, 2026


img

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి జంటగా చేస్తున్న ‘భోగి’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న  ఈ సినిమా 1960లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో దొరల అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల నేపధ్యంతో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో డింపుల్ హయతీ, శ్రస్థ శ్రీవాత్సవ్, అవినాష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్‌, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నె చేస్తున్నారు. 

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 12న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష