వృషకర్మ రిలీజ్‌ వాయిదా?

November 21, 2026


img

అక్కినేని నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా చేసిన ‘వృషకర్మ’ డిసెంబర్‌ 4న విడుదల కావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో సినిమా రిలీజ్‌ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌ 24న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

శనివారం ఉదయం కూడా వృషకర్మ డిసెంబర్‌ 4వ తేదీనే విడుదల కాబోతోందని, నవంబర్‌ 29న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కనుక వృషకర్మ రిలీజ్‌ వాయిదా కేవలం పుకారా లేక నిజంగానే వాయిదా పడిందా అనే విషయం చిత్ర బృందం తెలియజేయాల్సి ఉంది. 

కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ ఓ ముఖ్య పాత్ర చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ వృషకర్మ సినిమా నిర్మించారు.   


Related Post

సినిమా స‌మీక్ష