తెలంగాణలో నవంబర్‌ 22న పోలియో చుక్కల కార్యక్రమం

November 20, 2026
img

తెలంగాణలోని ఐదు జిల్లాల్లో నవంబర్ 22న వైద్య ప్రజారోగ్య సిబ్బంది పోలియో చుక్కల కార్యక్రమం చేపట్టనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హనుమకొండ జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఆ రోజు ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కల టీకా మందు వేస్తారు. మళ్ళీ నవంబర్ 23, 24 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి  పోలియో చుక్కలు వేయని పిల్లలను గుర్తించి వారికీ వేస్తారు.

ప్రభుత్వాలు మారినా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండటం వలన రాష్ట్రంలో పోలియో వ్యాధి దాదాపు కనుమరుగు అయ్యింది. అయినప్పటికీ తర్వాత తరం పిల్లలకు ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు ఏటా ఈ పోలియో చుక్కల కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు.

కనుక తల్లితండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్‌కు భరోసా కల్పించాలని ప్రజారోగ్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related Post