ట్విన్ టవర్స్ తరహాలో సౌదీ టవర్‌పై హూతీల దాడి

November 20, 2026
img

సౌదీఅరేబియా రాజధాని రియాద్ నగరంపై మరోసారి హూతీలు దాడి చేశారు. అత్యంత ఎత్తైన 80 అంతస్తుల పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ టవర్‌పై క్షిపణులతో దాడి చేశారు. గురువారం ఉదయం జరిగిన ఈ దాడిలో భవనంలోని 8 అంతస్తులు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. రియాద్ వైపుకు దూసుకు వస్తున్న మిగిలిన క్షిపణులను గాల్లోనే కూల్చివేశామని సౌదీ వాయుసేన ప్రకటించింది.  

ఈ దాడి 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ట్విన్ టవర్స్)పై ఆల్ ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడిని గుర్తు చేస్తోంది. 

నాడు ఉగ్రవాదులు రెండు విమానాలను హైజాక్ చేసి వాటితో ట్విన్ టవర్స్‌ను ఢీ కొట్టి కూల్చివేశారు. ఆ దాడిలో మొత్తం 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో టవర్స్‌ లోపల ఉన్నవారితో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, సహాయ చర్యలలో పాల్గొనేందుకు వచ్చిన వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా మరణించారు.

అయితే రియాద్‌లోని పీఐఎఫ్ టవర్స్‌లో పనిచేసే ఉద్యోగులలో చాలా మంది గత రెండు నెలలుగా వేర్వేరు ప్రాంతాల నుంచి (రిమోట్) పని చేస్తున్నందున, ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సౌదీ అధికారులు తెలిపారు. ఈ దాడిని తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రతిచర్యలు తప్పవని సౌదీఅరేబియా హూతీలను హెచ్చరించింది. 


Related Post