బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. భార్యాభర్తలకు గాయాలు

November 18, 2026
img

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయనతో పాటు భార్య ఇందుజాకు స్వల్ప గాయాలయ్యాయి. వారిరువురూ తిరుమల శ్రీవారిని దర్శించుకొని కారులో హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బల్మూరి వెంకట్ దంపతులు ప్రయాణిస్తున్న కారు డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. 

ఈ ప్రమాదంలో బల్మూరి వెంకట్ తమ్ముడు చాణక్య, కారు డ్రైవర్ శ్రీకాంత్ ఇద్దరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బహుశః పొగమంచు, నిద్రమత్తులో డ్రైవింగ్ కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించి, కారును రోడ్డు పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. 

Related Post