సాగర్ నీటిని ఏపీ తరలించుకుపోతున్నా పట్టించుకోరా?

November 18, 2026


img

తెలంగాణకు నీళ్ళ విషయంలో మరోసారి అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

నాగార్జునసాగర్‌పై ఆధారపడిన నల్గొండ రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, సాగర్ నుంచి నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టునిర్మిస్తున్నా పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, టీఆర్ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు.

ఏపీ ప్రభుత్వం పల్నాడు జిల్లాలోని 363 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.1,200 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తోంది. 

అయితే సాగర్ నీటిమట్టం 510 అడుగులకు చేరినా నీటిని తరలించుకునేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసి, ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నేతృత్వంలో బీఆర్ఎస్‌ నేతలు సాగర్ వద్ద ఆందోళన చేపట్టారు. మరోవైపు కవిత కూడా 'ఎక్స్‌' వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అనుమతులు లేని ప్రాజెక్టు పనులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.

కేటీఆర్‌ సైతం సాగర్ నుంచి ఏపీ 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.


Related Post