సూర్య సినిమాలో విలన్‌గా గోపీచంద్?

November 18, 2026


img

గోపీచంద్ కెరీర్ ప్రారంభంలోనే ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ వంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నుంచి చేసిన ప్రతీ సినిమాలో హీరోగానే నటిస్తున్నారు. అయితే మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు గోపీచంద్ మరోసారి విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

తమిళ స్టార్ హీరో సూర్య నటించనున్న తమిళ సినిమాలో విలన్‌గా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే గోపీచంద్‌కు తమిళ చిత్ర పరిశ్రమలో ఇదే తొలి సినిమా కానుంది. సూర్య సినిమాలో గోపీచంద్ ఉన్నా లేకపోయినా ఆయన సినిమాలన్నీ తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూనే ఉన్నారు. ఈసారి గోపీచంద్ కూడా ఉన్నందున తెలుగు, తమిళ్ రెండు భాషల్లో నిర్మిస్తున్నట్లు భావించవచ్చు.   

తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో సూర్య ఈ సినిమా చేయబోతున్నారు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. 

అలాంటి సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తే, తెలుగు సినీ పరిశ్రమకు మరొక కొత్త విలన్‌ దొరికినట్లే.  గా నటిస్తున్నారు. 

గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'భరతవర్ష'తో పాటు మరో సినిమాలో నటిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష