శ్రీనివాస్ వసంతాల దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న సినిమా పేరు ‘కొక్కొరోకో. ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా ఆర్వీ ఫిలిమ్స్ సొంత బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ‘సీతాకోకమ్మ’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. చంద్రబోస్ వ్రాసిన ఈ పాటకు ఎస్. కృష్ణ ప్రసాద్ సంగీతం అందించగా, శ్వేతా మోహన్ ఆలపించారు.
ఈ సినిమాలో సముద్రఖని, మానస్విని బాలబొమ్మల, సునీల్, చైతన్య రావు మాదాడి, త్రిష్, సప్తగిరి, సుబ్బరాజు, ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ప్రవీణ్, రామలింగ, శ్రీనివాస్ వడ్లమాని, జెమిని సురేష్, పమ్మి సాయి, గోపిక ఉదయ, ప్రియాంక కుమార్, ప్రీతి నేహా, బేబీ ఎం.వి. కృతి నందన, చాముండేశ్వరి చౌదరి (లక్ష్మి), వేద్విక సోని, అశోక్ కుమార్, గుల్లు దాదా (అద్నమ్ సాజిద్ ఖాన్), వినోద్ సాగర్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సినిమాకి డైలాగ్స్: శ్రీసాగర్, సంగీతం: ఎస్. కృష్ణ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆకాష్ ఆర్. జోషి, కొరియోగ్రఫీ: గ్రీష్మ, యాక్షన్: వెంకట్ ఎన్. వెంకటేష్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేస్తున్నారు.
డాక్టర్ జయంతీలాల్ సమర్పణలో ఎ.రమేష్ వర్మ నిర్మాణంలో పెన్ స్టూడియోస్, ఆర్వీ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. నిమాలో సముద్రఖని ప్రధానపాత్ర చేస్తున్నారు. రాఘవ లారెన్స్, పూజా హెగ్డే, నోరా ఫతే, మీరాజ్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ముందు అంటే జనవరి 7న ‘కొక్కొరోకో’ విడుదల కాబోతోంది.