కల్వకుంట్ల కవిత సారధ్యంలో టీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా త్వరలో జరుగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతోంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను ఇటీవలే అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఆకాష్ కొల్లూరును అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
కనుక ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్, బలమైన ప్రతిపక్షాలుగా నిలుస్తున్న బిజేపి, బీఆర్ఎస్ పార్టీలతో టీఆర్ఎస్ పార్టీ ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్నికలలో ఒక్క సీటు దక్కించుకున్నా టీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి చేరికలు మొదలవుతాయి.
కానీ కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ పార్టీల ముందు టీఆర్ఎస్ పార్టీ అసలు నిలబడగలదా? అనే సందేహం కలుగుతుంది.
అటువంటి పరిస్థితిలో కల్వకుంట్ల కవిత వలన బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు నష్టం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సాయపడుతుందా? ఈ ఎన్నికల ఫలితాలు ఏ కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తాయో?