అలియాస్ రుక్మిణి నుంచి రుకు రుకూ తొలి పాట విడుదల

October 30, 2026


img

నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమా నుంచి ‘రుకు రుకు రుక్మిణి’ తొలి లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. తాజా ట్రెండ్ ఫాలో అవుతూ దీని లిరిక్స్ తెలుగులో ఇవ్వడం అభినందనీయం. పూర్ణాచారి వ్రాసిన ఈ పాటకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

‘దండోరా’తో ప్రేక్షకులను మెప్పించిన మురళీకాంత్‌ దేవసోత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి కుమార్‌, హర్ష్ రోషన్‌ వర్ధన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరో (నితిన్‌) టీచర్ రుక్మిణి (ఆఫియా సయ్యద్ )తో ప్రేమలో పడతాడు. రుక్మిణి అనే కలం పేరుతో ప్రేమ నవలలు రాస్తుంటాడు.

ఈ సినిమాకు సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కెమెరా: జోమోన్‌ టీ.జాన్‌, ఎడిటింగ్‌: సృజన అడుసుమిల్లి చేస్తున్నారు.

నటుడు నాని సమర్పణలో దీప్తి గంటా యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న అలియాస్ రుక్మిణి డిసెంబర్ 4న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష