సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన తాజా చిత్రం ‘సిగ్మా’ ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. అదే రోజు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా నిరాశ పరచడంతో జాసన్ సంజయ్ తన తదుపరి సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దర్శకుడుగా మెప్పించలేకపోయిన జాసన్ సంజయ్ హీరోగా మెప్పించగలడో లేదో చూడాలి.