యంగ్ హీరో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన ‘ఇట్లు అర్జున’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ అక్టోబర్ 9న విడుదల కావాల్సిన వెంకటేష్, త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30న భారీ అంచనాలతో విడుదలవుతోంది. కనుక ఈ మార్పు ‘ఇట్లు అర్జున’తో సహా ఆ సమయంలో విడుదల కావాల్సిన మరికొన్ని చిన్న సినిమాలపై కూడా పడింది.
ఇదే విషయం తెలియజేస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 30న సినిమాను విడుదల చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నామని తెలిపింది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అప్పటివరకు తమకు ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమ, మద్దతును కొనసాగించాలని కోరింది. థియేటర్లలోకి రెట్టింపు వినోదంతో వస్తామని హామీ ఇచ్చింది.
ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ముకేశ్ రిషి, కలైయరసన్ హరికృష్ణన్, ఎలాంగో కుమరవేల్, గెటప్ శ్రీను, రఘుబాబు, అరుణ భిక్షు, ప్రవీణ లలితాబాయి, రోహన్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మహేష్ ఉప్పల, సంగీతం: తమన్, కెమెరా: రాజా మహదేవన్, స్టంట్స్:దినేష్ సుబ్బరాయన్, ఎడిటింగ్: కోటి చేశారు.
వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్: నం:1గా తెరకెక్కించిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుమల నిర్మించారు.