రంగులు రంగులే.. రామాయణ నుంచి అద్భుతమైన పాట!

October 25, 2026


img

నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ (మొదటి భాగం) నవంబర్‌ 5న దీపావళి పండుగనాడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతున్నందున వరుసగా ఒక్కో పాట విడుదల చేస్తున్నారు.   

ఇటీవల దసరా పండుగ సందర్భంగా ‘రైజ్ ఆఫ్ అసుర’ పేరుతో ఈ సినిమాలో రావణుడుగా నటిస్తున్న యష్‌ ‘శివతాండవం’ చేస్తున్న వీడియో విడుదల చేశారు. నేడు రంగులు రంగులే అంటూ సాగే మరో అద్భుతమైన పాట విడుదల చేశారు. పాటలో సాహిత్యం, సంగీతం, విజువల్స్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా సీతారాముల వివాహం, వారి మద్య ప్రేమానుబంధం ఈ పాటలో అద్భుతంగా చూపారు.     

రామాయణలో దశరథుడిగా అరుణ్ గోవిల్, రవీ దుబే లక్ష్మణుడుగా, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, మండోదరిగా కాజల్ అగర్వాల్, రావణుడుగా కన్నడ నటుడు యష్‌, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. 

ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు ఏఆర్ రహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. అలాగే 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్‌జీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు పనిచేస్తోంది. 

నవంబర్‌ 5న దీపావళి పండుగ సందర్భంగా రామాయణ మొదటి భాగం విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష