ఓ బ్రేక్‌ఫాస్ట్‌తో పెరిగిన విద్యార్ధులు హాజరు శాతం

October 24, 2026
img

ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్లు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ‘బ్రేక్‌ఫాస్ట్‌ పధకం’ కూడా అనూహ్య ఫలితాలు సాధిస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో ఈ ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పధకం అమలు చేస్తున్నప్పటి పాఠశాలల్లో హాజరు శాతం 75 నుంచి 90 శాతానికి పెరిగింది. 

కొడంగల్ నియోజకవర్గంలో 28,000 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్టు ప్రస్తుతం 14 మండలాల్లో 52,000 మంది పిల్లలకు విస్తరించారు.

ఈ పధకంతో విద్యార్ధుల హాజరు శాతం పెరుగుతుండటంతో  రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో దీని కోసం రూ.800 కోట్లు కేటాయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23,106 ప్రభుత్వ పాఠశాలలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం లభిస్తుంది. 

ఈ పధకంలో అల్పాహారం తయారీ, వాటి పంపిణీలో హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

విద్యార్థులకు ప్రతిరోజూ ఒకే రకమైన అల్పాహారం కాకుండా వారంలో ఆరు రోజులు వేర్వేరు వంటకాలు అందిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా మెనూను రూపొందించినట్లు కథనం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధులకు వేడివేడిగా అల్పాహార పంపిణీ చేసేందుకుగాను జిల్లా కేంద్రాలలో కేంద్రీకృత వంటశాలల ఏర్పాటు కు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Related Post