మజ్లిస్ పార్టీ ఏపీ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తోంది. కడప మేయర్, హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవులకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభ్యర్ధులను ప్రకటించారు.
అలాగే విజయవాడలో మూడు డివిజన్లు, ఆదోని-7, రాయదుర్గం-3 వార్డుల్లో, నంద్యాల, పెనుగొండలో చెరో ఒక్క వార్డులో మజ్లిస్ అభ్యర్ధులు శుక్రవారం నామినేషన్స్ దాఖలు చేశారు. హైదరాబాద్ నుంచి మజ్లీస్ ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మిరాజ్, మహ్మద్ ముబీన్, మజీద్ హుస్సేన్, ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ హసన్‌లో ఆయా ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
తెలంగాణలో హైదరాబాద్‌కే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఇదివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో బలమైన సంబంధాలు నెలకొల్పుకొని రాష్ట్ర రాజకీయాలను పరోక్షంగా శాశిస్తోంది. ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఏపీకి కూడా విస్తరిస్తే ఆ రాష్ట్రంలో రాజకీయాలను శాశించలేనప్పటికీ తప్పకుండా ఎంతో కొంత ప్రభావితం చేయగలదు.