తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నేడు సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.
తమ ప్రభుత్వం ఇలాంటి నోటి మాటలకు పరిమితం కాదని, పోలీసు అమరవీరుల కుటుంబాలకు వారి హోదా, సర్వీస్ వగైరా ఆధారంగా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాదు.. అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంటి స్థలాలు, విద్య, వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
కానిస్టేబుళ్ల కుటుంబాలకు రూ.కోటి, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్ల కుటుంబాలకు రూ.1.25 కోట్లు, డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారుల కుటుంబాలకు రూ.1.50 కోట్లు, ఎస్పీ, ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు రూ.2 కోట్ల వరకు పరిహారం అందిస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇక నుండి హోంగార్డుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. పోలీసులు, వారి కుటుంబాల ల సంక్షేమం, భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి మరోసారి భరోసా ఇచ్చారు.