హైదరాబాద్‌ లో ట్రాఫిక్ జామ్

October 22, 2026
img

దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

మరోవైపు నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నందున, పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి పోలీసులు వాహానాలను ఇతర మార్గాలకు మళ్ళిస్తున్నారు. 

దీంతో బయట ఊర్ల నుంచి వచ్చినవారి వాహనాలు ఒకవైపు, నగరంలో తిరిగే వాహనాలు మరోవైపు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్తున్నాయి. 

ఈ పరిస్థితిలో ఉద్యోగులు, వ్యాపారులు దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్ మెట్రో స్టేషన్లకు చేరుకొని మెట్రో రైళ్ళ ద్వారా గమ్యస్థానాలు చేరేందుకు ప్రయత్నించడంతో మెట్రో స్టేషన్లు కూడా శుక్రవారం ఉదయం కిటకిటలాడాయి. 

దసరా, బతుకమ్మ పండుగలకు ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కనుక గురువారం నుంచి నగరంలో జూనియర్ కాలేజీలు, శుక్రవారం నుంచి పాఠశాలలు తెరుచుకుంటాయి. కనుక విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తిరిగి రావడంతో మళ్ళీ నగరం కళకళలాడుతోంది.

Related Post