రేవంత్‌ దిష్టిబొమ్మ దగ్ధం.. బీఆర్ఎస్‌వీ కార్యకర్తలపై కేసు నమోదు

October 21, 2026


img

హైదరాబాద్‌లో దసరా పండుగ సందర్భంగా ఘటన సీతారాంబాగ్‌లోని రామ్‌ మైదాన్‌లో జరిగిన రావణ దహనం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్ఎస్‌ విద్యార్ధి విభాగం నాయకుడు నవీన్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సిఎం కేసీఆర్‌ని శ్రీరాముడిగా, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డిని రావణుడిగా ఏర్పాటు చేసి అయన బొమ్మను దహనం చేశారు. 

రేవంత్‌ రెడ్డి కటౌట్‌పై హెచ్‌సీయూ భూముల వివాదం, 22ఏ భూముల వ్యవహారం వంటి అంశాలను వ్రాసి, రావణుడిగా అభివర్ణించారు. రావణ రూపంలో ఉన్న సిఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ సిఎం కేసీఆర్‌ బాణం సందించినట్లు కటవుట్ పెట్టారు. 

సమాచారం అందుకున్న తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలను వెంటబెట్టుకొని అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మద్య వాదోపవాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి పరస్పరం దాడులు చేసుకున్నారు. 

మెట్టు సాయికుమార్ పిర్యాదు మేరకు పోలీసులు నవీన్‌తో సహా బీఆర్ఎస్‌వీకి చెందిన పది మందిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు.


Related Post